ఉపనిషత్తులు అనగా ఏమిటి?

వేదాంతము అని మనము పిలుచుకొనేదే ఉపనిషత్తులు. ఇవి వేదాలకు చివరిగా ఉండడంవలన వీటిని వేదాంతముఅంటారు.శ్రీ భగవద్గీత కు మూలాలు ఉపనిషత్తులే. వేదాలలో ఎక్కువ భాగం కర్మకాండకు (అనగాయజ్ఞయాగాలు,పూజలు మొదలగునవి) ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వగా ఉపనిషత్తులలో జ్ఞానమునకే ప్రాముఖ్యతనుఇచ్చి కర్మకాండను పట్టించుకొనలేదు. "ఉపనిషత్" అను పదానికి అర్థం సమీపములో ఉండడం. సత్యాలను గురువుదగ్గర తెలుసుకోవడం లేక ఆత్మ(పరమాత్మ) కు సమీపములో ఉండడం అని అర్థం. ఉపనిషత్తులు చాలా ఉన్నాయి. అందులో 108 ఉపనిషత్తులు మనకు తెలుసు. 108 లో 10 ఉపనిషత్తులకు ఆదిశంకరాచార్యులు భాష్యం వ్రాసారు. వీటినే దశోపనిషత్తులు అంటారు.

దశోపనిషత్తులు ఏమిటనేవి క్రింది శ్లోకం వివరిస్తుంది.

"ఈశ కేన కఠ ముండ మాండూక్య ప్రశ్న తిత్తిరి
ఐతరేయంచ ఛాందోగ్యం బృహదారణ్యకం దశ"

అవి
1.ఈశావాస్య ఉపనిషత్తు
2. కేనోపనిషత్తు
3. కఠ ఉపనిషత్తు
4.ప్రశ్నోపనిషత్తు
5. ముండకోపనిషత్తు
6. మాండూక్య ఉపనిషత్తు
7. తైత్తిరీయ ఉపనిషత్తు
8. ఐతరేయ ఉపనిషత్తు
9.ఛాందోగ్య ఉపనిషత్తు
10.
బృహదారణ్యక ఉపనిషత్తు

బ్లాగులో వీటిని గురించి వివరించాలనేది నా ప్రయత్నం. అంటే ఇక్కడ నేను సొంతముగా వ్రాసేది ఏమీ ఉండదు. మాహాత్ముల వాణినే నేను వ్రాస్తాను. కాని నేను అర్థం చేసుకొన్నది కూడా ప్రతి టపా చివర వ్రాస్తాను.

4 Responses to “ఉపనిషత్తులు అనగా ఏమిటి?”

indhu said...

chala manchi prayatnam... konasaginchandi

AumPrakash said...

Suresh babu garu mee praythnamu manchi prayathnamu, abhinandaneeyamu.
kaani naaku chinna sandhehamu, Vupanishatthulu anni vedanthamulu kadu... Vupanishathulanu vedanthamulannatlaithe 4 vedamulaku 4 vupanishathulu mathrame vundaali.kani miru cheppinattu chala vupanishathulu vunnai... Kani yajurvedamu lo 40 adhyayamulu vunnavi. 40 va adhyayamu 'eeshavashyopanishathu' kanuka vedanthamu leka vedantha grandhamu ani cheppa valasi vasthe 'eeshavashyopanishathu' ne cheppavalayunu. ika migilinavi vudaharanaku 'kata'maharshi chetha rachinchabadutachetha katopanishthu ani peru. alage konni vupanishathulu vaanini vrasina maharshula perla chetha piluvabaduthunnai. naaku thelisinadi nenu cheppani anyada bhavinchakandi. inkanu thelusukonavalenani na aasha.

"aumprakash arya"

మంచి విషయాలు చెప్తున్నందుకు కృతజ్ఞతలు. అభినందనలు.

ఆత్మ అంటే నిరాకారమై సకల చర్యలకు మూలమైన అదృశ్య శక్తి ఇది శరీరంలో ఎంతకాలం ఉంటుందనేది ఆ శరీరం ఘన,ద్రవ,వాయు రూపాలలో తీసుకొనే శక్తిలో మార్పుల పై ఆధారపడి ఉంటుంది